ప్రజా సంగ్రామ యాత్రలో మొవ్వా సత్యనారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తుందని బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై, ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండవ విఢత ప్రజా సంగ్రామ యాత్ర నారాయణపేట జిల్లా దేవరకద్ర నియోజక వర్గానికి చేరింది.

ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ తో మాట్లాడుతున్న మొవ్వా సత్యనారాయణ

ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు‌ బండి సంజయ్ కు మద్దతుగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహనరావు తో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ పాదయాత్ర చేశారు. బండి సంజయ్, గరికపాటి మోహనరావు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

ప్రజా సంగ్రామ యాత్రలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు మొవ్వా సత్యనారాయణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here