నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కళాకారుల భరతనాట్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. నృత్యాంజలి స్కూల్ అఫ్ డాన్స్ గురువు శృతి కిరణ్ శిష్య బృందం చేసిన భరతనాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పుష్పాంజలి, మూషిక వాహన, మహా గణపతిమ్, గణేష్ పంచరత్నం, నటేశ కౌతం, వర్ణం, గరుడ గమన, అదివో అల్లదివో, బ్రహ్మమొక్కటే, జతిస్వరం, అచ్యుతం కేశవం, వేంకటాచల నిలయం, మామవతు శ్రీ సరస్వతి, అంబ స్తుతి, పలుకే బంగారమాయెనా, శ్రీరామ చంద్ర, మంగళం అంశాలను కళాకారులు ప్రదర్శించారు. ప్రదర్శించిన వారిలో పర్ణిక, అనఘా, వినయ శృతి, అదితి, శ్రేష్ఠ, భావిక, హిరణ్య మహతి, మైత్రి, మయూఖ,సాన్వి తదితర కళాకారులు ఉన్నారు. సంగీత గురువు కమల నేమాని, సంగీత దర్శకులు, గాయని అమృత మహాభాష్యం, భరతనాట్య కళాకారిణి డాక్టర్ సత్య ఎస్ ఎన్ హాజరై ప్రదర్శనలను తిలకించారు. కళాకారులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.