నమస్తే శేరిలింగంపల్లి: క్రీడల్లో యువత రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిజెపి రంగారెడ్డి జిల్లా మేధావుల సెల్ కన్వీనర్ టి.రాఘవేందర్ రావు అన్నారు. నల్లగండ్ల శ్రీ ఫిట్ ప్రో బ్యాడ్మింటన్ కోర్టు మెంబర్ షిప్ ప్లేయర్‌ల కోసం ఈ నెల 4 వ తేదీన ప్రారంభమైన టోర్నమెంట్ 9వ తేదీ శనివారం ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన విన్నర్, రన్నర్ జట్ల సభ్యులకు రాఘవేందర్ రావు చేతుల మీదుగా ట్రోఫీలు, మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడారంగంలో ఉత్సాహం కనబరుస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చాలని అన్నారు. విజేత జట్టు సభ్యులు శ్రీధర్, గోపాల కృష్ణ, రన్నర్స్ టీమ్ సభ్యులు నాగబాబు, హరీష్ లకు ట్రోఫీలు, మెడల్స్ తో పాటు పాల్గొన్న క్రీడాకారులందరికి పార్టిసిపేషన్ మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రముఖులు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.