నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల మాజీ సర్పంచ్, నాయకులు కీర్తిశేషులు హరిశంకర్ గౌడ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నల్లగండ్ల గ్రామంలో హరిశంకర్ గౌడ్ సమాధి వద్ద శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తన తండ్రి హరిశంకర్ గౌడ్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనలో భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అడ్వైజరీ రాజు, డి. సునీల్, గిరి, అశోక్ గౌడ్, గౌరవ అధ్యక్షులు బాలకృష్ణ, లక్ష్మణ్, శివ కుమార్, జగదీష్, సన్నీ బేనర్జి, సృజన తదితరులు పాల్గొన్నారు.