నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ వాటర్ వర్క్స్ జీఎం రాజశేఖర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు రాజశేఖర్ ను వాటర్ వర్క్స్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ
కొండాపూర్ డివిజన్ పరిధిలో మంజూరు అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంజీరా మంచి నీటి పైప్ లైన్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.