చందాన‌గ‌ర్ లో నిర‌స‌న తెలుపుతున్న వామ‌ప‌క్ష కార్మిక సంఘాల నాయ‌కులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః ప్ర‌జ‌ల‌కు జీవ‌నోపాధి లేకుండా చేస్తూ త‌న కార్పొరేట్ దోపిడీ దారుల కోస‌మే ప్ర‌ధాని మోడీ నిరంకుశ విధానాలు అవ‌లంబిస్తున్నాడ‌ని వామ‌ప‌క్ష కార్మిక సంఘాల నాయ‌కులు శోభ‌న్‌, రామ‌కృష్ణ‌, నారాయ‌ణ అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేప‌ట్టిన దేశవ్యాప్త స‌మ్మెలో రెండో రోజులో భాగంగా చందాన‌గ‌ర్‌లోని కార్మికుల అడ్డాలో నిర‌స‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 లేబర్ కోడ్ బిల్లును తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో కార్మికులకు కనీస పనిగంటలు పోతున్నాయన్నారు. వాటితోపాటు ఈఎస్ఐ, పిఎఫ్ఐ కార్మిక విభాగంలో కార్మికులకు అందాల్సిన ఎలాంటి ప్రయోజనాలు అందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన‌ ఎల్ఐసి, బిహెచ్ఎల్, రైల్వే లాంటి సంస్థ‌ల‌ను గుజరాత్ వ్యాపారులకు కట్టబెడుతూ ప్రైవేటు ప‌రం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు హాని క‌లిగించే న‌ల్ల చ‌ట్టాల‌ను కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాల నాయకులు, కృష్ణ మూదిరాజ్, అభిషేక్, సహన నారాయణ తదితరులు పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ లో నిర‌స‌న తెలుపుతున్న వామ‌ప‌క్ష కార్మిక సంఘాల నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here