నమస్తే శేరిలింగంపల్లిః బీసీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా దారి మళ్లిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ బిజెపి కార్యాలయంలో ఓబీసీ మోర్చా హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన డివిజన్ ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించి పూర్తి స్థాయి కమిటీని నియమించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని అన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిందన్నారు. రాష్ట్రంలో నిరుపేదల బీసీలకు బీసీ బందు ఇవ్వాలన్నారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. 50 శాతం ఉన్న బీసీలను కేవలం కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఓబీసీ మోర్చా కమిటీలో నియమితులైన వారికి ఓబీసీ మోర్చా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్ చేతుల మీదుగా నియామకపు పత్రాలను అందజేశారు. బిజెపి ఓబీసీ మోర్చా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు చురుగ్గా ఉంటూ కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టలన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ అసెంబ్లీ కన్వీనర్ పృథ్వి గౌడ్, బిజెపి డివిజన్ అధ్యక్షుడు శ్రీధర రావు, నాయకులు రవి గౌడ్, కోటేశ్వర రావు, ఉపాధ్యక్షులు అశోక్, రవి ముదిరాజ్, మల్లేష్, నవీన్ కుమార్, రామారావు, నాగలక్ష్మి, జానీ, రామ చంద్రుడు, రవి, ఆంజనేయులు, సత్యం, చంద్రశేఖర్, గోపి, మహేష్, నరసింహ రావు, రుద్రవీర్, మధు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.