నమస్తే శేరిలింగంపల్లి: మహిళల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి డివిజన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా బంధు కేసీఆర్ రెండవ రోజు చేపట్టారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళ పెన్షన్, లబ్ధిదారులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాగం సుజాత యాదవ్ గోపీ నగర్, నెహ్రు నగర్ లో ఇంటింటికి వెళ్లి శాలువాతో సన్మానించి, కేసీఆర్ చిత్రపటాన్ని, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలతో ఆర్థిక సహాయం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మహిళలకు గౌరవం పెరిగిందని, మహిళల రక్షణకు సీఎం కేసీఆర్ షీటీమ్స్ ఏర్పాటు చేశారన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళా పెన్షన్ లబ్ధిదారులు బేబీ, సుల్తానా, అశ్రఫ్, రోషన్, నస్రీన్, ముస్కన్, సాజీద, ఆఫ్రీన్, తహేరా, నస్రీన్, శారద, మల్లిక, లక్ష్మి, స్వాతి, శృతి, వరాలు, స్వప్న, సంధ్య తో కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ నేరుగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, యాదా గౌడ్, వార్డు మెంబర్లు పర్వీన్ బేగం, శ్రీకళ, కవిత, చంద్రకళ, భాగ్యలక్ష్మి, సౌజన్య, రజిని కుమారి, జయ, రోజా రాణి, సుధారాణి, జ్యోతి, ఫాతిమా, గౌసియా, రజిత, లక్ష్మణ్ యాదవ్, బస్తీ కమిటీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, దేవులపల్లి శ్రీకాంత్, మహేందర్ సింగ్, గఫర్, దివాకర్ రెడ్డి, రాజ్ కుమార్, పట్లోళ్ల నర్సింహారెడ్డి, జమ్మయ్య, వినయ్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.