సీఎస్ఆర్ కింద పేద విద్యార్థులకు మలబార్ అండ్ గోల్డ్ చేయూత – ప్రభుత్వ విప్‌ గాంధీ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. భారత దేశంలో అతిపెద్ద బంగారు, వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు మలబార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం, మధుర నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని 100 విద్యార్థినీలకు రూ. 9500 చొప్పున మొత్తం రూ. 9.50 లక్షల స్కాలర్ షిప్ చెక్కులను గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుకోవడానికి ఈ ఉపకార వేతనాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు మంచిగా చదివి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు‌‌. ఎంతో సహృదయంతో ముందుకు వచ్చి విద్యార్థినీలకు సహాయం అందజేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు సురేందర్, జగదీష్, రాయదుర్గం విద్య కమిటీ సభ్యులు వెంకటేష్, రమేష్ గౌడ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కే. శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మలబార్ గ్రూపు సభ్యులు రిటైల్ హెడ్ రెస్ట్ అఫ్ ఇండియా సిరాజ్ పి .కె, సోమాజిగూడ స్టోర్ హెడ్ శరీజ్.పి, కొండాపూర్ స్టోర్ హెడ్ జిజాన్ దీపక్, మలబార్ గ్రూపు మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here