నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తామని కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని పీజేఅర్ స్టేడియంలో అసిస్టెంట్ డైరెక్టర్ వీర్ ఆనంద్, అధికారులు, శానిటేషన్ సిబ్బంది, క్రీడా కోచ్ లతో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్టేడియంలోని పలు సమస్యలను కార్పోరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. స్టేడియంలో బాస్కెట్‌బాల్ కోర్టు ప్లోరింగ్ మరమ్మతులు లేక పుర్తిగా దెబ్బతిన్నదని, స్కేటింగ్ గ్రౌండ్ తదితర పలు సమస్యలను త్వరగా పరిష్కరించాలని స్టేడియం సిబ్బంది కోరారు. స్టేడియంలో పారిశుధ్య నిర్వహణ పనులు సరిగ్గా నిర్వహించడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని మరోసారి ఫిర్యాదులు రాకుండా చూడాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పీజేఅర్ స్టేడియంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హమీనిచ్చారు. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, స్టేడియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.