నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ లోని మజీద్ బండ ప్రభుపాద లే అవుట్ లో జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. రోడ్లు, డ్రైనేజి,బమంచి నీటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రభుపాద లే ఔట్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సందీప్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రభుపాద లే ఔట్ కాలనీ వాసులు సుధాకర్, వేణు, రామేశ్వర్ రావు, శ్రీకాంత్, భువన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.