నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని కేఎస్ఆర్ ఎన్ క్లేవ్ లో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను అధికారులతో కలిసి స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. యూజీడీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.