నమస్తే శేరిలింగంపల్లి: చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడు అదృశ్యమైన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కడప జిల్లా రాజంపేటకు చెందిన నర్సింహా చారి (23) ఓలా బైక్ నడిపిస్తూ అంజయ్య నగర్ లోని రిషి మెన్స్ పీజీ హాస్టల్ లో ఉంటున్నాడు. పెద్ద ఎత్తున అప్పులు ఉన్నాయని, తిరిగి చెల్లించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అనుకున్నట్లు తెలిసింది. ఈ నెల 17 వ తేదీన నర్సింహా చారి కనబడకుండా పోవడంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ బి. ప్రమోద్ తెలిపారు. ఏదైనా సమాచారం లభిస్తే 7901125526, 8331013199 నంబర్లను సంప్రదించాలన్నారు.