నమస్తే శేరిలింగంపల్లి: గిరిజనులకు దశ, దిశను చూపి, హైందవ ధర్మం గొప్పతనం, విశిష్టతలను తెలియజేయడానికే సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి సంత్ సేవాలాల్ మహారాజ్ పునాదులు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాణిక్, లక్ష్మణ్ ముదిరాజ్, వినోద్ యాదవ్, బాబు ముదిరాజ్, రెడ్యా నాయక్, సీతారాం నాయక్, రత్న కుమార్, తిరుపతి, రవీందర్ నాయక్, పాపయ్య, బాబి, ఆంజనేయులు, వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ గిరిజనుల కోసం చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, రత్నాకర్, చందు, ఆంజనేయులు, రెడ్యానాయక్, రత్నాకర్, తాండా వాసులు పాల్గొన్నారు.
దేశంకోసం, హిందూ ధర్మంకోసం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి, గిరిజనుల అభ్యున్నతికి పాటుపడిన విధానం నేటి సమాజం ఎన్నటికీ మరవదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జీ గజ్జల యోగానంద్ అన్నారు. నడిగడ్డ తండాలో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నడిగడ్డ తండా అధ్యక్షులు తిరుపతి నాయక్, ప్రధాన కార్యదర్శి రత్నకుమార్,దశరథ్, సీతారాం నాయక్, బిజెపి సీనియర్ నాయకులు మాణిక్ రావు, శ్రీధర్ రావు, విజేందర్, ఆకుల లక్ష్మణ్, రామకృష్ణ, రవీందర్ నాయక్, వినోద్, ప్రభాకర్, పాపయ్య, కళ్యాణ్, శ్రీను, వెంకట్, నాయకులు, తండా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.