- స్థానికుల సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్, తారకరామా నగర్ కాలనీ సమస్యలపై స్థానికులతో కలిసి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మంగళవారం బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ ఏర్పాటు సమయంలో నిర్మించిన డ్రైనేజీ కావడంతో తరచూ పొంగుతున్నాయని, డ్రైనేజీ విస్తరించాలని, వీధి దీపాల సమస్య ఇబ్బందికరంగా ఉందని ఆయన దృష్టికి స్థానికులు సమస్యలను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ వీధి దీపాల సమస్యలు రెండు రోజుల్లో పూర్తి చేస్తామని, నెల రోజుల్లో డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యువ నాయకుడు రామకృష్ణ గౌడ్, సీనియర్ నాయకుడు బోయ కిషన్, ఏరియా కమిటీ మెంబర్లు బి.వెంకటేష్ గౌడ్, రాములు గౌడ్, నర్సింహా చారి, నాయకులు రామస్వామి, నాగభూషణం, జగదీష్, వాసు, యాదగిరి, ప్రదీప్ రెడ్డి, కటికె రవి, వీరస్వామి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.