నమస్తే శేరిలింగంపల్లి: గ్రామీణ ప్రాంతాలను తలపించేలా నారాయణ ఒలంపియాడ్ విద్యార్థులు సంక్రాంతి సంబరాలను నిర్వహించుకోవడం సంతోషకరమని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. మధీనగూడలోని నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో విద్యార్థులతో నిర్వహించిన సంక్రాంతి సంబురాలను కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని విద్యార్థులు రంగ వల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, కోడి పందాలు, బొమ్మల కొలువులు, పాడి పంటలు, తదితర అంశాలపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. మన సాంస్కృతిక, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం నేటి పౌరులపై ఎంతైనా ఉందని పాఠశాల ప్రిన్సిపాల్ రాధిక పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం వేణుగోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.