నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని బిజెపి రాష్ట్ర నాయకులు బండి సంజయ్ అభివర్ణించారు. బండి సంజయ్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజానీకం ప్రజాస్వామ్యంలో ఉందా..? హిట్లర్, పాలనలో ఉందా అని ప్రశ్నించారు.
317 జీఓ తో ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే జీఓ సవరణ కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసుల తో అరెస్టు చేయించడం అప్రజాస్వామికమని అన్నారు. కొత్త సంవత్సరానికి వైన్స్, బార్లకు, రెస్టారెంట్లకు అనుమతినిచ్చినప్పుడు గుర్తుకురాని కోవిడ్ నిబంధనలు ఉద్యోగుల సమస్యల కోసం దీక్ష చేస్తే గుర్తుకువచ్చిందా అని రవికుమార్ యాదవ్ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు.