నమస్తే శేరిలింగంపల్లి: మతసామరస్యాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన క్రిస్టమస్ కానుకలను పాస్టర్లకు, క్రిస్టియన్ సోదరులకు కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలు, మతాలను సమదృష్టితో చూస్తున్నారని అన్నారు. అన్ని మతాలకు సంబంధించిన ముఖ్యమైన పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గ క్రిస్టియన్ సోదరులకు సోదరీమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోసిన్, పాస్టర్లు స్వర్ణలత, కమలాకర్, ప్రసాద్,శ్యామ్, బాబు, రమేష్, డేవిడ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.