నమస్తే శేరిలింగంపల్లి: మాజీ కేంద్ర మంత్రివర్యులు, 1969 తెలంగాణ ఉద్యమ నాయకులు కీర్తిశేషులు డాక్టర్ మల్లికార్జున్ గౌడ్ 19వ వర్ధంతిని శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నల్లగండ్లలోని మల్లికార్జున్ సమాది వద్ద శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అడ్వైజరీ రాజు, డి. భాగ్య రావు, సామ్రాట్, గౌరవ అధ్యక్షులు బాలకృష్ణ, లక్ష్మణ్, సురేందర్, మల్లేష్, సన్నీ బెనర్జి, రేవంత్, శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు జయసాయి, యూత్ సభ్యులు ఆగస్టీన్, శివానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.