నమస్తే శేరిలింగంపల్లి: కుస్తీ పోటీల్లో ఘన విజయం సాధించిన జాహ్నవి యాదవ్ ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి రాంచందర్ యాదవ్ ఘనంగా సన్మానించారు. బోరబండ కు చెందిన వీరన్న యాదవ్ కూతురు జాహ్నవి యాదవ్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో కుస్తీ పోటీపై ఆసక్తితో కోచ్ శ్రీకాంత్ యాదవ్ శిక్షణలో శిక్షణ తీసుకుని రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. దంగల్ మూవీని చూసి ఆదర్శంగా తీసుకున్న జాహ్నవి యాదవ్ తన తండ్రికి వివరించగా కుస్తీ పోటీల్లో శిక్షణ ఇప్పించడం గర్వకారణం అని అన్నారు. క్రమశిక్షణతో, పట్టుదలతో, విధేయతతో శిక్షణ పొంది జిల్లా, రాష్ట్రస్థాయిలో కుస్తీ పోటీలలో బంగారు పతకాలు సాధించిందన్నారు. అండర్ 15 రెజ్లింగ్ ఛాంపియన్ లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో గెలుపొందడంతో పాటు నల్గొండ జిల్లాలో 6.6 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని పొందడం సంతోషకరమని అన్నారు. జార్ఖండ్ లో త్వరలో జరగనున్న ఆల్ ఇండియా వ్రెస్లింగ్ చాంపియన్ షిప్ లో తెలంగాణ రాష్ట్రం తరపున జాహ్నవి యాదవ్ పాల్గొననుందని భేరి రాంచందర్ యాదవ్ వివరించారు.