నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, క్రిస్టియన్ సోదర సోదరీమణులందరికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్దలతో క్రిస్మస్ పండగను జరుపుకోవాలని అన్నారు. క్రిస్మస్ పవిత్రమైన పండుగ అని, పండుగను చక్కటి వాతావరణంలో శాంతియుతంగా కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకునేలా చర్చిల వద్ద అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పేద క్రిస్టియన్లకు నూతన బట్టలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. అన్ని మతాల వారి పండగలకు ప్రధాన్యతనిస్తూ సోదరభావంతో ఐక్యమత్యానికి ప్రతీకగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. అర్హులైన ప్రతి పేద వారికీ అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.