నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రం పట్ల బిజెపి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంజీరా పైపులైన్ 100 ఫీట్ రోడ్డు లో టీఆర్ఎస్ నాయకులు అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. తెలంగాణ రైతుల యాసంగి వడ్లు ఒక్క కిలో కూడా కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మల శేఖర్ గౌడ్, గంగారం సంగారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, రామకృష్ణ గౌడ్, షేక్ జమీర్, యువత విభాగం దిలీప్, టిఆర్ఎస్వీ గణేష్ రెడ్డి, వెంకట్, ఉమేష్, మీరజ్ రాజు తదితరులు ఉన్నారు.