నమస్తే శేరిలింగంపల్లి: రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ సూచనల మేరకు బిజెపి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దాబా, మధురా నగర్ నుండి ఖాజాగూడ ప్రధాన కూడలి వరకు సాయిబాబా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా చావు డప్పుతో ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ శవయాత్ర చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పట్ల బిజెపి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను అవలంబించడం సరికాదన్నారు. యాసంగి వడ్లు ఒక్క కిలో కూడా తీసుకోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పినందుకు నిరసనగా, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళ నాయకులు, టిఆర్ఎస్ యూత్ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.