దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తాం : ప్రభుత్వ విప్‌ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సైబర్ ఎన్ క్లేవ్ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ లో ఉన్న పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై జీహెచ్ఎంసీ అధికారులు, కాలనీ వాసులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరించి శాశ్వత పరిష్కారం చూపుతాం అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పా సుబ్బయ్య, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

హుడా కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here