నమస్తే శేరిలింగంపల్లి: రజకుల ఆరాధ్య దైవం, దీరోదాత్తురాలు చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని, రజకుల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ శ్రీ రామ్ నగర్ మసీద్ బండలో నిర్వహించిన జలనిధి రజక సేవా సంఘం ప్రథమ వార్షికోత్సవంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకుల కోసం దోబి ఘాట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రజకుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సేవా సంఘం అధ్యక్షుడు జి.జగదీష్, ఉపాధ్యక్షుడు పెద్దిరాజు, వెంకట్ రావు, తాత రావు, జీ. శ్రీనివాస్, రాఘవ, గోపాల్ యాదవ్, పటోళ్ల నరసింహారెడ్డి, రవికిరణ్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.