నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో బాసటగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న 17 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 22.55 లక్షల చెక్కులను ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. వీరిలో మియాపూర్ డివిజన్ న్యూ కాలనీ కి చెందిన విజయ్ శేఖర్ రెడ్డి కి అత్యవసర చికిత్స నిమిత్తం ముందస్తుగా మంజూరైన రూ. 5 లక్షల ఎల్ ఓ సీని, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కి చెందిన గొడ్డు రాజుకు అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 5 లక్షల ఎల్ ఓ సీని ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా నిలుస్తోందని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా, నాయకులు ఆదర్శ్ రెడ్డి, సాంబశివరావు, బ్రిక్ శ్రీను, కాశినాథ్ యాదవ్, అనిల్ కావూరి, చంద్రమోహన్ సాగర్, శ్రీనివాస్ చౌదరీ, రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.