నమస్తే శేరిలింగంపల్లి: కూకట్పల్లి సర్కిల్- 24 పరిధిలోని వివేకానంద నగర్ డివిజన్ లో శానిటేషన్ విభాగంలో ఎస్ ఆర్ పీ గా విధులు నిర్వహిస్తూ బిజెపికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం సరికాదని, ఎస్ ఆర్ పీ నాగేశ్వర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా సెక్రెటరీ అశోక్, జిల్లా మహిళా మోర్చా సెక్రటరీ విద్యా కల్పనా గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమతకు శుక్రవారం ఆదారాలతో సహా ఫిర్యాదు చేశారు. బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా సెక్రెటరీ అశోక్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ లో ఎస్ ఆర్ పీ గా పనిచేస్తున్న నాగేశ్వర్ నాయక్ తన వాట్సాప్ స్టేటస్ లో బిజెపికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం సరికాదన్నారు. గతంలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్ లో డబ్బులు తీసుకొని స్లాట్ బుక్ చేస్తుంటే అడ్డంగా దొరికిపోవడంతో ఎస్ ఆర్ పీ నాగేశ్వర్ నాయక్ పై పలు వార్తా పత్రికల్లో వచ్చిందన్నారు. విచారణ జరిపించి ప్రభుత్వ ఉద్యోగ నియమనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎస్ ఆర్ పీ నాయక్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బిజెపి నాయకులు ఏకాంత్ గౌడ్, గణేష్ గౌడ్, జితేందర్, తదితరులు పాల్గొన్నారు.