కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలన : చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కరోనా మహమ్మారి వృద్ధి చెంది మూడో దశతో ముంచుకొస్తుందని, ప్రజలందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకోవాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట, గౌతమీ నగర్ పలు కాలనీలలో వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వాక్సినేషన్ స్పేషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముడో దశ కరోనా నివారణకు రెండు డోసుల టీకా వేసుకొని కరోనా మహమ్మారి నియంత్రణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు యుసుప్, దాసు, సత్యనారాయణ, గౌరవ్, విజ్ఞాశ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న కార్పొరేటర్‌ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here