నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనగూడ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పున:నిర్మాణానికి హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర గౌడ్ భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణానికి తమవంతు సహాయం అందజేస్తామని పూజితజగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన అవసరం అన్నారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.