నమస్తే శేరిలింగంపల్లి: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయం సత్యవాణి భర్త గొట్టిపాటి చంద్రశేఖర్ రావుకు పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల మృతిచెందిన చంద్రశేఖర్ రావు సంస్మరణ సభ దీప్తీశ్రీనగర్ శ్రీ ధర్మపురి క్షేత్రం లోక కళ్యాణ మంటంపంలో బుధవారం నిర్వహించారు. క్షేత్రం భక్తులు, స్థానికంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పంచారు. వారితో ఉన్న జ్ఞాపకాలను నేమరేసుకున్నారు.
ఎన్ఎస్ఎన్ కాలనీ శ్రీ అభయాంజనేయ కోలాట బృందం భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయం సత్యవాణి మాట్లాడుతూ శ్రీ ధర్మపురి క్షేత్రం స్థాపన, నిర్వహణ, ప్రతి దశలో శ్రీ చంద్రశేఖర రావు కృషి మరిచిపోలేనిదని అన్నారు. ధర్మపరిరక్షణ కోసం తాను చేపట్టిన ప్రతి కార్యంలోను తన భర్త ప్రోత్సాహం ఎంతో ఉండేదని, వారి తోడ్పాటుతోనే ఎన్నో సేవాకార్యక్రమాలను నిర్వర్తించానని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.