నమస్తే శేరిలింగంపల్లి:సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం సమరశీల పోరాటాలకు సన్నద్దం కావాలని అఖిలభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (ఏఐఎఫ్ డీ వై) జాతీయ సహాయ కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు.బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్ లో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో భాగంగా అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర స్థాయి ముఖ్య క్యాడర్ క్లాస్ మంగళవారం నిర్వహించారు. గాదగోని రవి మాట్లాడుతూ నేటి కాలంలో సంపద కొందరి చేతుల్లో పోగు అవుతున్న పేదరికం, దారిద్ర్యం, అసమానతలను నిర్మూలన చేయటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని అన్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడికి పాల్పడుతున్న పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తున్నాయని ఎద్దేవా చేశారు. అసమానతలను రూపుమాపేందుకు చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందడం వలన నేటి విద్యార్థులు నిరుద్యోగులు గా మారుతున్నారు అని అన్నారు. నేటి విద్యా వ్యవస్థ లొ శాస్త్రీయ విద్యా విధానం ప్రవేశ పెట్టాలన్నారు. ఈ వ్యవస్థ లో మార్పు వచ్చేందుకు విద్యార్థి లోకం శ్రీ కారం చుట్టాలని పిలుపు నిచ్చారు. అనంతరం ఏ ఐ యఫ్ డి యస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున పలు తీర్మాణాలను ప్రవేశపెట్టారు. నూతన విద్యా విధానం ను రద్దు చేయాలని, యూనివర్సిటీల ప్రైవేటీకరణను, ప్రయివేటు విద్యా విధానం రద్దు చేయాలని, కామన్ స్కూల్ విద్యా విధానం ప్రవేశ పెట్టాలని, కెజి టు పిజి విద్య విధానం ప్రవేశ పెట్టాలని, ఉత్పత్తి రంగంలో ప్రధానమైన రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రైవేటు విద్యుత్ బిల్లును రద్దు చేయాలని తీర్మానించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాలోతు జబ్బర్ నాయక్, ఉపాధ్యక్షులు వసకుల భరత్, రాష్ట్ర నాయకులు నాగరాజు, ఫయాజ్, కాశీ, భానుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.