నమస్తే శేరిలింగంపల్లి:మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ శ్రీ సత్య సాయి సమితి , ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ ఆధ్వర్యంలో మియాపూర్ ప్రాంతంలోని ఓంకార్ నగర్, నడిగడ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ నగర్ లలో నివాసం ఉంటున్న పేదలు, వృద్దులకు నిత్యావసర సరుకులను అందజేశారు. పేదలకు వారం రోజులు సరిపడే బియ్యం, పప్పు, ఉప్పు కారం, ఆయిల్ పాకెట్స్, గ్లాస్, ప్లాట్, బట్టలు పంపిణీ చేశారు. ఓంకార్ నగర్ లో 50 మందికి, నడిగడ్డ తండా లో 10 మంది కి, చంద్రబోస్ నగర్ లో ఐదు మందికి శ్రీ సత్యసాయి సేవ సమితి మానవత్వంతో ఈ సరుకులను పంపిణీ చేయడం జరిగిందని ఏఐబీఎస్ఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరత్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓంకార్ నగర్ కమిటీ సభ్యురాలు విమల, తండా సభ్యులు డి నర్సింహా, తుకారం నాయక్, శ్రీ సత్య సాయి సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.