పదవులు లేకున్నా ప్రజాసేవలో ముందుంటా: మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా

  • బ‌స‌వ‌తార‌క న‌గ‌ర్‌లో స్వంత నిధుల‌తో ప‌వ‌ర్ బోరు ఏర్పాటు

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల కష్టాలను తీర్చడంలో ఎప్పుడూ ముందు ఉంటామని, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పదవులు అవసరం లేదని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక్ నగర్ లో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా తన స్వంత డబ్బులతో బోరు వేయించి మోటర్ బిగింపజేశారు.‌ దీంతో కాలనీలో నీటి సమస్య తీరిందని, ప్రజలు సాయిబాబా కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ‌సాయిబాబా‌ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా ఏ సమస్య ఉన్న పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. పదవులు శాశ్వతం కాదని పదవి లేకున్నా ప్రజల్లో ఉండి ప్రజా సేవలో పాలుపంచుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు రాగం జంగయ్య యాదవ్, రమేష్ గౌడ్, బసవతారక నగర్ వాసులు బాబు, కుమార్, రంగయ్య, గంగాధర్, శివ బస్తీవాసులు పాల్గొన్నారు.

సొంత నిధులతో బోరు వేయించి నీటి సరఫరా చేస్తున్న కొమిరిశెట్టి సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here