నమస్తే శేరిలింగంపల్లి: ఇళ్లల్లోని చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జీహెచ్ఎంసీ చెత్త ఆటో రిక్షాల్లో వేసి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కాలనీలోని ఇళ్ల మధ్యలో చెత్త వేయకూడదని, దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాలను కాపాడుకోవచ్చన్నారు. జీహెచ్ఎంసీ ఆటోలో చెత్త వేయనివారికి నోటీసులు ఇచ్చి జరిమానా వేయనున్నట్లు చెప్పారు. జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బందితో దోమల నివారణకు ఫాగింగ్ చేయించారు.