కేసీఆర్ పథకాలకు అందరూ‌ ఆకర్శితులవుతున్నారు: ప్రభుత్వ విప్‌ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందరిని ఆకర్శితులుగా చేస్తున్నాయని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పల పాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ రంగారావు సమక్షంలో గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఎదురులేని శక్తిగా మారనుందని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ లోకి చేరిన వారిలో రాజేందర్ కుమార్, ఫీరోజ్ ఖాన్, దేవా సక్పాల్, ఖదీర్, ఎండీ. మస్తాన్, అరుణ్ కుమార్, రఘు, ప్రేమ్ కుమార్, రియాజ్ ఖాన్, అల్తాఫ్, షారుక్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాయి నేని చంద్రకాంత్, గంధం రాములు ,దామోదర్ రెడ్డి,కార్తిక్ రావు ,పోతుల రాజేందర్, తిరుమలేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here