మారుతున్న సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలి: జేఎన్టీయూహెచ్ వీసి కట్ట నర్సింహారెడ్డి

  • ఘనంగా జోగినపల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే

నమస్తే శేరిలింగంపల్లి:విద్యార్థులు జీవితంలో పైకి రావాలంటే రోజు రోజుకు మారుతున్న సాంకేతికతను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ లో ప్రపంచ సాంకేతికతకు అనుకూలంగా ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నాం అని జేఎన్టీయూహెచ్ వీసీ కట్ట నర్సింహారెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం భాస్కర్ నగర్ లోని జోగినపల్లి బీఆర్ ఇంజనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ వీసీ కట్ట నర్సింహా రెడ్డి, టిసిఎస్, సిఎస్ఐ చాప్టర్ చైర్మన్ పెద్దిగారి బాల ప్రసాద్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. గోవర్థన్, బీఓసీ మెంబర్ ప్రొఫెసర్ డా.పి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.  విద్యార్థులను ఉద్దేశించి వీసీ కట్ట నర్సింహా రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కొత్త పరిశోధనలు చేసి స్టార్టప్ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాలని కోరారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో అధ్యాపకుల పాత్ర కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండి నలుగురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. టిసిఎస్, సిఎస్ఐ చాప్టర్ చైర్మన్ బాల ప్రసాద్ పెద్దిగారి మాట్లాడుతూ సాంకేతిక విద్యను అంది పుచ్చుకుని దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలని విద్యార్థులకు సూచించారు. మంచి కంపెనీలో ప్లేస్మెంట్స్ కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. బీఓసీ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రోఫెసర్ కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ ఈ కళాశాల 2002 నుంచి ప్రారంభమై కళాశాల 19 సంవత్సరాలు పూర్తిచేసుకుని రెండో దశాబ్దం పూర్తిచేసుకొనేందుకు సమాయత్తమవుతూ విజయవంతంగా కళాశాల నడుస్తున్నదన్నారు. ఈ కళాశాల నుండి ఎంతోమంది విద్యార్థులు పెద్దపెద్ద ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు పొందారని విదేశాలలోనూ మంచి కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించారని గుర్తు చేశారు.

జోగినపల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న వీసీ కట్ట నర్సింహా రెడ్టి తదితరులు

అనంతరం ప్రతిభ కనపరచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ టాపర్ అవార్డులను వీసీ కట్ట నర్సింహా రెడ్డి చేతుల మీదుగా బహుకరించారు‌. జోగిన్ పల్లి బిఅర్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రథమ గ్రాడ్యుయేషన్ డే జెబిఅర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ వంశీధర్ రావు, జెబిఅర్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ ఏఅర్ ప్రొఫెసర్ గాయత్రి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా.ఉషశ్రీ వ్యవహరించగా జెబి గ్రూప్ విద్యాసంస్థల సీఈఓ మేజర్ జనరల్ డా. ఎస్ఎస్ దసాక, జెబి గ్రూప్ క్యాంపస్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డి, భాస్కర్ మెడికల్ కాలేజ్ సిఏ యాదయ్య, జేబి ఐటి ప్రిన్సిపాల్ కృష్ణమాచారి, భాస్కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా.చలం, భాస్కర్ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాస రావు, భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉదయ్ కిరణ్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా.ఉషశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డా.అరుణ్ మూర్తి, గ్రాడ్యుయేషన్ డే కోఆర్డినేటర్ ప్రొఫెసర్ శేషగిరి, ప్రొఫెసర్ రాజేందర్, ప్రెస్ అండ్ మీడియా ఇంచార్జ్ పి వై రమేష్, కళాశాల డీన్స్, హెచ్ఓడీలు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ టాపర్ అవార్డులను అందజేస్తున్న వీసీ కట్ట నర్సింహా రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here