టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్ – సమావేశం నిర్వహణకు పలు కమిటీల ఎంపిక

నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్స్ లో అక్టోబ‌ర్ 25న జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశం ఏర్పాట్లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పరిశీలించారు. ఫ్లీనరీ సమావేశం విజయవంతం చేసేందుకు పలు కమిటీలను వేశారు. ఆహ్వాన కమిటీ సభ్యులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మీ ని నియమించారు.

ఏర్పాట్లపై చర్చిస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సభా వేదిక ప్రాంగణం అలంకరణ సభ్యులుగా ఎమ్మెల్యే గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీసీసీ చైర్మన్ బాలమల్లు, సివిల్ సప్లయి చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రతినిధుల నమోదు, వాలంటరీ గా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వాహనాల పార్కింగ్ బాధ్యతలు ఎమ్మెల్యే కేపి వివేక్, ప్రతినిధుల భోజనం సౌకర్యాలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తీర్మణాల కమిటీ సభ్యులుగా మధుసూదన చారి, పర్యదా కృష్ణామూర్తి, మీడియా ఇంచార్జీలుగా ఎమ్మెల్సీ భాను ప్రసాద్, కర్నే ప్రభాకర్ లను కేటీఆర్ నియమించారు. ఆయన వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీలు నవీన్, కర్నెప్రభాకర్, టీసీసీ ఛైర్మెన్ గ్యాదరి బాలమల్లు, పౌర సరఫరాల ఛైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యే లు మాగంటి గోపీనాథ్, కృష్ణా రావు, మాజీ మేయర్ బొంతు రాం మోహన్, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు, ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, జోనల్ కమిషనర్ రవి కిరణ్ , డీసీ సుధాంష్, తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here