ప్రకాష్ నగర్ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పనులు పరిశీలించిన కార్పొరేటర్ పూజిత గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఆదివారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ లో చేపట్టిన నూతన సీసీ రోడ్డు పనులను స్థానికులతో కలిసి కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. సీసీ రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, పరమేష్, రాజేశ్వర రావు, గిరిజ, ఆంజనేయులు, వెంకటేశ్వర రావు, రమేష్ గౌడ్, బెనర్జీ, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

ప్రకాష్ నగర్ సీసీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here