నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని శిల్పా ఎంక్లేవ్ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చందానగర్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జమ్మి మొక్కను నాటారు. రాజ్య సభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా దసరా పండగను పురస్కరించుకుని ప్రతి ఊరిలో జమ్మి చెట్టు, ప్రతి గుడిలో జమ్మి మొక్కను నాటాలని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదేశాల మేరకు జమ్మి వృక్షాన్ని నాటుతున్నట్లు ఐవిఎఫ్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ అన్నారు. మన రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు అని, జమ్మి చెట్టు ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ చందానగర్ కమిటీ పబ్బ శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ జై కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఐవిఎఫ్ వాణి, రాణి, వరలక్ష్మి, శిల్పా ఎంక్లేవ్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రసాద్, మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ శిల్పా ఎంక్లేవ్ జనరల్ సెక్రటరీ జయ్ కుమార్ కాలనీ వాసులు పాల్గొన్నారు.