నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను దేవత గా పూజించే ఘన చరిత్ర మన తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కాలనీలో శనివారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, రోజాదేవి రంగారావు, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రపంచంలో పూల తో దేవుడిని పూజిస్తారని అదే పూలను దేవతగా బతుకమ్మ రూపంలో కొలుస్తారని అన్నారు. తెలంగాణ ఆచార, సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అని, మన అడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటిచెప్పే పూల వేడుక అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో కలిసి భక్తితో గౌరమ్మను పూజించి బతుకమ్మను మహిళ కార్పొరేటర్లు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షులు వాల హరీష్ రావు, నాయకులు కృష్ణ ముదిరాజ్, విష్ణువర్ధన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కిషన్ రావు, జనార్ధన్ గౌడ్, సుబ్బా రావు, ప్రసాద్ రెడ్డి, సురేష్, బాబు మోహన్ మల్లేష్, ఉమామహేశ్వర్ రావు, లక్ష్మీనారాయణ, రామకృష్ణ నగర్ మహిళ అధ్యక్షురాలు వాల సుజాత, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత, జనరల్ సెక్రెటరీ శ్యామల, కల్చరల్ సెక్రెటరీ సునీత తదితరులు పాల్గొన్నారు.