నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి క్షేత్ర స్థాయిలో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మజీద్ బండలోని కార్యాలయంలో బిజెపి కొండాపూర్ డివిజన్ కమిటీని పూర్తి స్థాయిలో రవికుమార్ యాదవ్, డివిజన్ ఇంచార్జి ఆనంద్ కుమార్, డివిజన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు సాగర్ సమక్షంలో నియమించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ బిజెపిలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని అన్నారు. కొండాపూర్ నూతన కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. బిజెపి కొండాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులుగా చంద్ర శేఖర్ యాదవ్, బి .రాజు, ఉపాధ్యక్షులుగా ఆకుల నరసింహ, బాలాజీ, చెన్నయ్య, నరేష్ ముదిరాజ్, సరోజ రెడ్డి, కొండాపూర్ డివిజన్ బీసీ మోర్చా ప్రెసిడెంట్ సురేష్, ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ జి. చందు, ఎస్టీ మోర్చా అధ్యక్షునిగా ధన్ రాజ్, కార్యదర్శులుగా డి. సునీత, అనంత్, మహేష్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా కన్వీనర్ పద్మ, నరసింహ, గోపాలకృష్ణ, రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.