నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగుడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ ను సోమవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వాళ్లు ఆదార్ కార్డుతో వ్యాక్సినేషన్ సెంటర్ కు రావాలని సూచించారు. ప్రజల ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా వాక్సినేషన్ విషయంలో ప్రత్యేక దృష్టి చేస్తున్నాము అన్నారు. ఈ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్, తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరు మహేశ్వరి, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం ప్రెసిడెంట్ శివ, సీనియర్ నాయకులు, అరుణ్ గౌడ్, శివ సింగ్, ఇందిరా, వరలక్ష్మి, బాబు, గోవర్ధన్, రవి కుమార్, ప్రశాంత్, చిన్న, శంఖేష్ సింగ్, బిజెపి నాయకులు, కార్యకర్తలు కాలనీ వాసులు పాల్గొన్నారు.