నమస్తే శేరిలింగంపల్లి: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి బాబా ఆలయం కమ్యూనిటీ హల్, జనప్రియ ఫేస్-5 కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జనప్రియ సాయి బాబా ఆలయం కమ్యూనిటీ హాల్ లో సీనియర్ సిటిజన్ డే పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఘంటసాల సంగీత సాధానాలయం (సంగీత కచేరీ) కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు. పెద్దలను గౌరవించుకోవడం మన సంప్రదాయం అని, ప్రతి సంవత్సరం జనప్రియ నందు ఘంటసాల సంగీత సాధానాలయం సంస్థ వృద్దులను సంతోషకరంగా ఉంచడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, శాంతయ్య, శ్రీనివాస్, చలపతి, లక్ష్మయ్య, జితేందర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, అశోక్, కిష్టన్న, వెంకట్ సాంబయ్య, సత్యమూర్తి, సోమయాజులు, రాజు, చంద్ర మోహన్ రెడ్డి, రాజి రెడ్డి, మహిళలు పద్మ, సుచిత్ర, జ్యోతి, సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.