నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయానికి బతుకమ్మ పండగ ప్రతిబింబమని, ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండగ విశిష్ట వైభవాన్ని సంతరించుకుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పేట్ వార్డ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా ఆడపడుచులకు అందించే బతుకమ్మ చీరలను స్థానిక కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్ తో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. బతుకమ్మ పండగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు వాల హరీష్ రావు, కనక మామిడి వెంకటేష్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, కనక మామిడి నరేందర్ గౌడ్, లక్ష్మా రెడ్డి, సుదర్శన్, శాంతయ్య, శేఖర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, సంజు సాగర్, శేఖర్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, సయ్యద్ సాదిక్ హుస్సేన్, జ్ఞానేశ్వర్, వెంకట్ రెడ్డి, సంగా రెడ్డి, నాయుడు, రమేష్ గౌడ్, చాంద్ పాషా, సాబేర్ హుస్సేన్, రవీందర్, పద్మ రావు, జనార్ధన్ ముదిరాజ్, యూనిస్, నాగరాజ్, మల్లేష్,బరాజు యాదవ్, రాజేశ్వర గౌడ్, చిన్న, ముజీవ్ మహిళలు పద్మ, షబానా, జ్యోతి, సత్యలక్ష్మి, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.