నమస్తే శేరిలింగంపల్లి: జాతిపిత మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని మదీనాగూడ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు జయంతి వేడుకలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక రుగ్మతలు లేకుండా దేశం అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేసిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవటమే అసలైన నివాళి అని అన్నారు. సత్యం, అహింసా, ధర్మం, మార్గాలలో నడిచిన బాపూజీ కుల, మాతవర్గ విబేధాలు లేని అభివృద్ధి చెందిన భారతదేశం కోసం కలలు గన్నారని అన్నారు. సామాజిక మార్పుకోసం అహర్నిశలు శ్రమించారని, గాంధీజీ చూపిన బాటలో నడవటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాణిక్ రావు, రవి గౌడ్, కోటేశ్వరరావు, జితేందర్, నర్సింహారావు, రత్నకుమార్, ప్రభాకర్, విజేందర్, రవి, సిద్దు, నవీన్, శివ, క్రాంతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.