నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణలోని సగరుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ను కోరారు. గురువారం అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ప్రధానంగా కోకాపేటలో ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించిన స్థలాన్ని మార్చకుండా చూడాలని, కుల వృత్తిపై ఆధారపడి ఉన్న సగరులకు ప్రభుత్వ నిర్మాణ కాంట్రాక్టు పనులను, రిజర్వేషన్లను పెంచాలని కోరారు. బట్టి విక్రమార్కను కలిసిన వారిలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సగర సంఘం నాయకులు నీరడి భూపేష్ సాగర్, గంట రాజు సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు సగర తదితరులు ఉన్నారు.