నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామం మెట్ల కుంట చెరువులో డ్రోన్ యంత్రం సహాయంతో చెరువులో దోమల మందును స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ దోమల బెడదపై కాలనీ వాసులు, చెరువు చుట్టూ ఉన్న ప్రజల విజ్ఞప్తి మేరకు ఎంటమాలజీ సిబ్బందితో కలసి డ్రోన్ యంత్రం సహాయంతో దోమల మందు పిచికారీ చేయిస్తున్నట్లు చెప్పారు. మన ఇంటితోపాటు చుట్టుపక్కల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్ర పర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్ , సీనియర్ నాయకులు రంగస్వామి, చిన్న, ఎస్ వెంకటేష్, సుమన్, ఎం వెంకటేష్, జిహెచ్ఎంసి సూపర్ వైర్ ప్రసాద్, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.