నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలాంటిదని, ఆర్థికంగా వెనకబడిన వారికి వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం మంజూరైన రూ. 1.68 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో బాధితులకు శనివారం ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి నగర్ కి చెందిన వెంకట్ దాస్ కి రూ. 60 వేలు, బాపు నగర్ కి చెందిన రాజ్ కుమార్ కి రూ. 56 వేలు, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కి చెందిన షాహిన్ ఉన్నిసా కి రూ. 28 వేలు, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానాక్ రాంగూడ కి చెందిన మధు కుమారి కి రూ. 24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు వివరించారు. పేద కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు , మోజేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.