నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలో వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా మండపాల వద్ద విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ దుర్గ మాత ఆలయం, హరిజన బస్తీ లో విద్యుత్ కేబుల్, స్తంభాల సమస్యలను ట్రాన్స్ కో ఏఈ, స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. నూతన స్తంభాల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, వినాయక ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న విద్యుత్ మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు ఈ.శ్రీనివాస్ గౌడ్, నాయకులు మధుసూధన్ రెడ్డి, సహదేవ్, ప్రభు, రాజు, యువకులు గోపాల్, కిట్టు, శివ నాయక్, ప్రేమ, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.