సీసీ కెమెరాల కోసం ఆర్థిక సహాయం చేసిన సత్యనారాయణను అభినందించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కి చెందిన టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సత్యనారాయణ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ కృష్ణ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం తన వంతు సహాయంగా రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ గాంధీ చేతుల మీదుగా కాలనీ వాసులకు విరాళంగా అందజేశారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సత్యనారాయణ సహృదయంతో శ్రీ కృష్ణ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందజేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ను ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ్, రాజు , మహాదేవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

సిసి కెమెరాల‌ కోసం ప్రభుత్వ‌ విప్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేస్తున్న సత్యనారాయణ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here